- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖాళీ పోస్టుల్లో నియామకాలు చేపట్టాలి: ఆల్ ఇండియా బ్యాంకు అధికారుల సంఘం
ఉద్యోగులపై పని భారం అధికమవుతుందని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఖాళీ పోస్టుల్లో నియామకాలు జరపాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగరాజన్ డిమాండ్ చేశారు.

దిశ, హిమాయత్ నగర్: ఉద్యోగులపై పని భారం అధికమవుతుందని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఖాళీ పోస్టుల్లో నియామకాలు జరపాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగరాజన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం లక్డీకాపూల్ లోని ఓ ప్రైవేటు హోటల్ లో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ 8 వ సదస్సు జరిగింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగరాజన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్రం ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రైవేటీకరణ ప్రక్రియను అమలు చేసే యత్నాలు అడ్డుకోవాలన్నారు. కేంద్రం బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రైవేటీకరణ చర్యల వల్ల సామాన్యులకు పలు ఇబ్బందులు కలుగుతాయన్నారు. చాన్నాళ్లుగా బ్యాంకింగ్ వ్యవస్థలో వివిధ కేటగిరీల్లో ఖాళీల పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ఆయన కోరారు. అన్ని బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ న్యాయమైన డిమాండ్ల సాధన దిశగా సర్కార్ యుద్ద ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించాలని కోరారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు., ఉద్యోగుల అపరిష్కృత సమస్యల గురించి సమావేశంలో చర్చించారు. ఆల్ ఇండియా బ్యాంక్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, కార్యదర్శి మురళీ కృష్ణ, స్టేట్ సెక్రటరీ డీవీఎస్ సుబ్రమణ్యం సుమారు 150 ప్రతినిధులు పాల్గొన్నారు.






