- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: ఇండియా మెడికల్ సెక్టార్ గ్రేట్.. అమెరికన్ మహిళ ప్రశంసలు వైరల్
అమెరికా మందుల ధరలకు, ఇండియా రేట్లకు ఉన్న తేడాను వివరిస్తూ ఓ యూఎస్ మహిళ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రదేశం అమెరికా (America)లో అన్ని ఖరీదే. తెల్లరింది మొదలు పడుకునేంత వరకు రోజువారీ లైఫ్‌స్టైల్‌లో ప్రతి విషయం వందల డాలర్లతోనే ముడిపడి ఉంటుంది. అక్కడ వైద్య ఖర్చులు, ప్రిస్క్రిప్షన్స్ ఎంత భారంగా ఉంటాయో ఎన్నారైలు మొత్తుకుంటూనే ఉంటారు. తాజాగా ఇదే ముచ్చటను చెబుతూ.. ఓ అమెరికన్ మహిళ సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలో రూ.86 వేలు అంటే సుమారు 1,032 డాలర్లు ఖరీదు చేసే తన మందుల ప్రిస్క్రిప్షన్, ఇండియాలో జస్ట్ రూ.2,150 అంటే 25.74 డాలర్లకే లభించిందని ఆమె ఆశ్చర్య వ్యక్తం చేసింది.
ఇండియాలో మెడిసిన్ ధర చూసి మైండ్ బ్లాంక్..
అయితే, అమెరికన్ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) రీల్‌లో ఓ విషయాన్ని అందరితో షేర్ చేసుకుంది. కొన్నాళ్లుగా తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, అమెరికాలో డాక్టర్లు ఓ స్పెషల్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రాశారని తెలిపింది. అయితే, యూఎస్ ఫార్మసీలో ఆ మందుల ధర చూసి ఆమెకు మైండ్ బ్లాక్ అయిందని, ఇన్సూరెన్స్ వర్తించినప్పటికీ, కేవలం ఒక నెల మందుల కోసమే ఆమె ఏకంగా 1,032 డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.86 వేలు చెల్లించాల్సి వచ్చిందని తెలిపింది. అనంతరం ఆమె యూఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ పెద్ద స్కామ్ అంటూ అసహనం వ్యక్తం చేసింది.
భారత్‌పై ప్రశంసల జల్లు..
కాగా, కొన్ని రోజులకు సదరు అమెరికన్ మహిళ తన పర్సనల్ పనిమీద ఇండియాకు వచ్చింది. అమెరికాలో రాసిన ప్రిస్క్రిప్షనే ఇండియాకు వచ్చాక ఇక్కడి లోకల్ ఫార్మసీలో చూపించి మెడిసిన ఇవ్వాలని చెప్పింది. అనంతరం షాప్ సిబ్బంది జస్ట్ రూ.2,150 అంటే 25.74 డాలర్లు పే చేయండి అనడంతో ఆమె మైండ్ బ్లాంక్ అయింది. ‘భారతదేశంలో మందులు ఇంత చౌకగా లభిస్తాయని నేను అస్సలు ఊహించలేదు. ఇక్కడి హెల్త్‌కేర్ సిస్టమ్ నిజంగా అద్భుతం’ అంటూ సదరు మహిళ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది.






