- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలాల్పూర్ గ్రామ పిల్లలంతా ప్రభుత్వ బడికే..
జలాల్పూర్ గ్రామ ప్రజలంతా ముక్తకంఠంతో గ్రామంలో గల బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడికి పంపుతామని తీర్మానించారు.

దిశ, బాల్కొండ: బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గ్రామపంచాయతీ, గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు ముక్తకంఠంతో గ్రామంలో గల బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడికి పంపుతామని తీర్మానించారు. ప్రీ ప్రైమరీ నుండి ఐదవ తరగతి వరకు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలకు పంపాలని తీర్మానించారు. బడిబాట సందర్భంగా ఆదివారం జలాల్పూర్ గ్రామంలో జరిగిన సమావేశంలో గ్రామపంచాయతీ పాలక బృందం, గ్రామ అభివృద్ధి కమిటి సభ్యులు ఏకగ్రీవ తీర్మానించారు. సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సుధాకర్, కిషన్ రెడ్డి, గంగారెడ్డి, రవి, రాములు, మల్కన్న ప్రధానోపాధ్యాయులు పసుల అభిమన్యు ఉపాధ్యాయులు, కృపాని, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






