తెలంగాణ హీటెక్కిన పాలిటిక్స్.. సీఎం‌కు ఎంపీ రఘునందన్ సంచలన సవాల్

by Kema Shiva Kumar |

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామాపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ హీటెక్కిన పాలిటిక్స్.. సీఎం‌కు ఎంపీ రఘునందన్ సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే (Kishan Reddy)నని, రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని.. అందుకే కిషన్ రెడ్డిపై అనవసరంగా నోరుపారేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అనంతరం ఆయన సీఎం రేవంత్‌కు సంచలన సవాల్ విసిరారు. 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమని అన్నారు. కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ.. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు వారు గెలుస్తారో.. తాము గెలుస్తామో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని. ముందు మా సవాల్‌ను స్వీకరించాలని రఘునందన్‌ రావు అన్నారు.

Next Story