- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీలో ఘనంగా వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో ఆదివారం స్వచ్ఛంద రక్తదానం పై అవగాహన కార్యక్రమం, రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.

దిశ, సికింద్రాబాద్: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో ఆదివారం స్వచ్ఛంద రక్తదానం పై అవగాహన కార్యక్రమం, రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ఇందిర, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి పాల్గొని రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని సూచించారు. యువత స్వచ్ఛంద రక్తదానంలో ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ ఏడాది వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ.. గివ్ బ్లడ్.. సేవ్ లైఫ్ అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ రజిని, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరిత తదితరులు పాల్గొన్నారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే రోగులకు ఇది ఎంత కీలకమో వివరించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు రక్తదానం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. శిబిరంలో రక్తదానం కోసం 150 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా, 90 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.






