- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: బోర్లా పడ్డావ్.. గుర్తుందా కేటీఆర్...!
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సిల్లీ కామెంట్స్ చేస్తున్నాడని, అసత్యాలు చెప్పడమే ఆయనకు పనిగా మారిందని ప్రభుత్వ విప్, వేముల వీరేశం మండిపడ్డారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సిల్లీ కామెంట్స్ చేస్తున్నాడని, అసత్యాలు చెప్పడమే ఆయనకు పనిగా మారిందని ప్రభుత్వ విప్, వేముల వీరేశం మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం ఒక శాపంలా తయారైందని, పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్పగా చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ఆదివారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వేముల వీరేశం మాట్లాడుతూ కేటీఆర్ మాటలు చూస్తుంటే కల్వకుంట్ల కుటుంబానికి ఇక బుద్ధి రాదని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని, ఆ కుటుంబం అహంకారానికి బుద్ధి చెప్పినా పొగరు బోతుతనం ఆగలేదని ఆయన ఫైర్ అయ్యారు.
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు శని, ఆదివారాలు ఆయన సెల్ ఆఫ్ చేసుకునే వాడని, కానీ, ఆదివారం కూడా సీఎం సెలవు తీసుకోవడం లేదని వేమల వీరేశం అన్నారు. కరెంటు కష్టాలు, పొలాలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేశారని, ఈ సారి అత్యధిక దిగుబడి వచ్చిందని రైతులు సంతోషంగా ఉంటే ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని ప్రచారం చేస్తున్నారు, కేటీఆర్ నిజం మాట్లాడరని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో ఎంతో మందికి వెన్నుపోటు పొడిచారుని, తెలంగాణ ఉద్యమకారులను అనేక విధాలుగా బాధపెట్టారు, చరిత్ర హీనులుగా మారారని వేముల వీరేశం ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు విని జనం నవ్వుకుంటున్నారని, దొంగ సర్వేలతో అబద్దాలు చెప్పకుండా బతకలేని స్థితిలో ఉన్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఒక తరాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని, తెలంగాణను వినాశనం చేశారని వేముల వీరేశం విమర్శించారు.
వారి దుర్మార్గపు, విధ్వంపు, ఆరాచక విధానాల మూలంగానే తెలంగాణ దెబ్బతిన్నదని, బీఆర్ఎస్ అనే పార్టీని తెలంగాణ గడ్డ పైన మొలకెత్తనివ్వకుండా సీఎం పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబం పదేళ్లు కష్టపడి తెలంగాణలో దోపిడి అనే సినిమా ను రూపొందించిందని, ఇందిరమ్మ రాజ్యం సినిమా చూశాక కేటీఆర్ దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయిందని వేముల వీరేశం తెలిపారు. బీఆర్ఎస్ విధానాలు, కేటీఆర్ పని విధానం నచ్చకనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే వాళ్లకు దూరంగా ఉంటున్నాడన్నారు. పార్టీ గుర్తు పైన ఎన్నికలు వస్తే ప్రతాపం చూపిస్తానని కేటీఆర్ అన్నాడని, పార్టీ గుర్తు పైన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ బోర్లా పడ్డాడని వేముల వీరేశం ఎద్దేవా చేశారు.






