- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PLI: పీఎల్ఐ పథకంతో పెట్టుబడుల వెల్లువ
2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ పథకం ద్వారా రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ తయారీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం గణనీయమైన ఫలితాలను నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ పథకం ద్వారా రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. అంతేకాదు, రూ.22.66 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, అమ్మకాలు నమోదవగా, దేశీయంగా రూ.14.15 లక్షల కోట్ల వాల్యూ అడిషన్ జరిగింది. ఆర్‌టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 892 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. 2020లో ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, మెడికల్ డివైసెస్, టెక్స్‌టైల్స్ తదితర 14 కీలక రంగాల్లో అమలవుతోంది. పెట్టుబడుల పరంగా చూస్తే, అధిక సామర్థ్యం గల సోలార్ పీవీ మాడ్యూల్స్ రంగం రూ.64,873 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత ఫార్మాస్యూటికల్స్‌లో రూ.45,158 కోట్లు, ఆటోమొబైల్స్-ఆటో కంపోనెంట్స్ రంగంలో రూ.44,326 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. మరోవైపు డ్రోన్లు, డ్రోన్ విడిభాగాలు (రూ.595 కోట్లు), ఐటీ హార్డ్‌వేర్ 2.0 (రూ.908 కోట్లు), మెడికల్ డివైసెస్ (రూ.1,151 కోట్లు) తక్కువ పెట్టుబడులను ఆకర్షించిన రంగాలుగా నిలిచాయి. ఈ విజయంతో కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని మరిన్ని రంగాలకు విస్తరించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే టెక్స్‌టైల్ పీఎల్ఐ రెండో విడత కింద 96 కంపెనీలకు ఆమోదం లభించడం, దేశీయ తయారీకి మరింత ఊతమివ్వనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.






