ఇంత నీచమైన ప్రచారమా: జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-14 11:06:16  IST  )

డీఎస్సీపై, టీచర్లపై కక్ష ఏంటని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. డీఎస్సీపై ఇంత నీచమైన ప్రచారమా అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న నిరసనలు, విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంత నీచమైన ప్రచారమా: జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: డీఎస్సీ(DSC)పై, టీచర్ల(Teachers)పై కక్ష ఏంటని మంత్రి అచ్చెన్నాయుడు(Minsiter Atchannaidu) ప్రశ్నించారు. డీఎస్సీపై ఇంత నీచమైన ప్రచారమా అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న నిరసనలు, విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీని గొడ్డలి పార్టీ అనిపించుకున్నారని అచ్చెన్న ఎద్దేవా చేశారు. డీఎస్సీపై 270 కేసులు వేశారని గుర్తు చేశారు. ప్రతి కేసు కోర్టు కొట్టేసిందని, పేపర్ లీక్ అన్నారని, మెరిట్ లిస్టు ఇవ్వలేదని ప్రచారం చేశారని, నవీన్ అనే వ్యక్తి గురించి చెప్పారని, స్పోర్ట్స్ కోటా వద్దు అన్నారని మంత్రి గుర్తు చేశారు.

చివరకు తోక ముడిచారు..

అలాగే మహిళా రిజర్వేషన్ సైతం వద్దు అన్నారని, దివ్యాంగులకు రిజర్వేషన్ వద్దు అన్నారని.. వీటి అన్నింటిపై అధికారుల వివరణతో తోక ముడిచారని అచ్చెన్న ధ్వజమెత్తారు. ఏకంగా జగన్ తన పార్టీ మనుషులతో ఒక ఫేక్ ఆడియో కాల్ మాట్లాడించి, అది విడుదల చేసి అడ్డంగా దొరికిపోయాడని మండిపడ్డారు. ఈ రోజు ఏకంగా ఒక కులాన్ని తీసుకొచ్చి, ఆ కులానికే టీచర్ పోస్టులు అన్నీ ఇచ్చేశారని, పేటీయం బ్యాచ్‌తో ప్రచారం చేపిస్తున్నారని తెలిపారు. డీఎస్సీ నియామకంలో ఓసీ నుంచి 12% మందిలో కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారని, అలాంటిది స్పోర్ట్స్ కోటా కింద 372 మంది ఒకే కులం వారితో నింపేశారని, పచ్చి అబద్ధం ఆడిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బుద్ధి చెప్పినా.. ఈ ఫేక్ పనులు మానవా జగన్ అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Next Story