ఉద్యోగులతో చిర్రుబుర్రు.. ఐఏఎస్ అధికారిపై బదిలీ వేటు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-14 12:28:52  IST  )

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్‌పై బదిలీ వేటు పడింది. తదుపరి పోస్టింగ్‌పై జీఏ డిపార్ట్ మెంటులో రిపోర్టు చేయాలని సీఎస్ జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు....

ఉద్యోగులతో చిర్రుబుర్రు.. ఐఏఎస్ అధికారిపై బదిలీ వేటు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్‌(AP Health Secretary Saurabh Gaur)పై బదిలీ వేటు పడింది. తదుపరి పోస్టింగ్‌పై జీఏ డిపార్ట్ మెంటులో రిపోర్టు చేయాలని సీఎస్ జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా ఎస్ సురేశ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌తో విభేదాల నేపథ్యంలో బదిలీ చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌ల వినిపిస్తున్నాయి.

ఆరు నెలల క్రితమే బాధ్యతలు

కాగా ఆరు నెలల క్రితమే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే కొద్ది రోజులుగా ఆయనను బదిలీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆ శాఖ ఉద్యోగుల పట్ల ఆయన తీరు సరిగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హెల్త్ డిపార్ట్ మెంట్ బాగోలేదని హెవోడీలపైనా సౌరబ్ గౌర్‌ చిర్రుబుర్రులాడారనే చర్చ సాగింది. అంతేకాదు ఆయన పోరు పడలాక చాలా మంది ఉద్యోగులు సెలవులపై వెళ్లిపోయారనే విమర్శలు కూడా వినిపించాయి. వీటన్నింటి నేపథ్యంలో సౌరబ్ గౌర్‌పై బదిలీ వేటు పడిందనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి.

Next Story