BMW India: ధరలు పెంచిన బీఎండబ్ల్యూ

by S Gopi |

అన్ని కార్లపైనా 2 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. సవరించిన కొత్త ధరలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

BMW India: ధరలు పెంచిన బీఎండబ్ల్యూ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా తన బీఎండబ్ల్యూతో పాటు మినీ బ్రాండ్‌లకు చెందిన అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. అన్ని కార్లపైనా 2 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. సవరించిన కొత్త ధరలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ధరల పెంపు భారత్‌లో తయారవుతున్న మోడళ్లతో పాటు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే (సీబీయూ) వాహనాలకూ వర్తించనుంది. రూపాయి విలువ క్షీణించడం, రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరణ ఇచ్చింది. ప్రీమియం నాణ్యత, సేవల ప్రమాణాలను కొనసాగించేందుకు ధరల సవరణ తప్పలేదని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ పేర్కొన్నారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ ఇండియా 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్, 5 సిరీస్, 7 సిరీస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7 వంటి మోడళ్లను దేశీయంగా తయారు చేస్తుండగా, ఐ7, ఐఎక్స్, ఎం5, ఎక్స్ఎం వంటి హైఎండ్ మోడళ్లను పూర్తిగా దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది.

Next Story