- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిబట్ల సర్కిల్ పరిధి బొంగ్లూర్ లోని సప్తగిరి కాలనీలో ఒక ఇంటిలో అన్యమత ప్రచారం జరుగుతోందన్న సమాచారంతో హిందూ వాహిని సంఘం నేతలు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న క్రిస్టియన్ పాస్టర్లకు, హిందూ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త స్వల్ప ఘర్షణకు దారితీసింది. తమపై దాడి జరిగిందని క్రిస్టియన్ నేతలు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఆదిబట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఇరువర్గాలను ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు కేవలం హిందూ సంఘాల నేతలపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని హిందూ వాహిని, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా హిందూ వాహిని, బీజేపీకి చెందిన 100 మందికి పైగా నేతలు, కార్యకర్తలు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో హిందూ సంఘ నాయకులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో హిందూ సంఘం నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి భద్రతా చర్యలు చేపట్టారు. ఇరువర్గాల ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.






