ఆపన్న హస్త మిత్ర బృందం సేవలకు విశిష్ట గుర్తింపు

by Taduka Kalyani |

గజ్వేల్ కు చెందిన ఆపన్న హస్త మిత్ర బృందం సభ్యులు కష్టకాలంలో ఉన్న పేద ప్రజలను ఆదుకుంటూ వివిధ మార్గాల్లో అందిస్తున్న సేవలకు విశిష్ట గుర్తింపు లభించింది.

ఆపన్న హస్త మిత్ర బృందం సేవలకు విశిష్ట గుర్తింపు
X

దిశ, గజ్వేల్ : గజ్వేల్ కు చెందిన ఆపన్న హస్త మిత్ర బృందం సభ్యులు కష్టకాలంలో ఉన్న పేద ప్రజలను ఆదుకుంటూ వివిధ మార్గాల్లో అందిస్తున్న సేవలకు విశిష్ట గుర్తింపు లభించింది. ప్రస్తుత సంవత్సరం జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ వారికి, ఆపన్న హస్త మిత్ర బృందం గజ్వేల్ వారి ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలోనే మొదటి సారిగా 277 యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సేవలకు గుర్తింపుగా ఆదివారం ప్రపంచ రక్తధాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమములో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా అందరి కృషి ఫలితంగా ఆపన్న హస్త మిత్ర బృందానికి గవర్నర్ చేతుల మీదుగా అవార్డ్ రావడం సంతోషంగా ఉందని అద్యక్షులు బాల చంద్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపన్న హస్త మిత్ర బృందం అధ్యక్షులు పాశికకంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యామ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు, కొలిచెలిమె స్వామి, సభ్యులు ఎగ్గిడి రాజు, ఆయిల శ్రీకాంత్, దేవసాని హనుమాన్ దాస్, కూరగాయల రాంబాబు, చెరుకు రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story