సమాజాన్ని తట్టి లేపిన 'మట్టి మనిషి 'నాటకం

by Jakkula.Mamatha |

ఖమ్మం భక్తారం దాస్ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నెల నెల వెన్నెల అభ్యుదయ సాంస్కృతిక కదంబం సమర్పించిన మట్టి మనిషి సాంఘిక నాటకం ప్రేక్షకులను అలరించింది.

సమాజాన్ని తట్టి లేపిన మట్టి మనిషి నాటకం
X

దిశ, ఖమ్మం కల్చరల్: ఖమ్మం భక్తారం దాస్ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నెల నెల వెన్నెల అభ్యుదయ సాంస్కృతిక కదంబం సమర్పించిన మట్టి మనిషి సాంఘిక నాటకం ప్రేక్షకులను అలరించింది. భూమి ఉత్పత్తి సాధనమని వ్యాపార సాధనం కాదని చాటి చెబుతూ హైదరాబాద్ మిత్ర క్రియేషన్స్ సమర్పించిన మట్టి మనిషి నాటకం సజీవ దృశ్యంగా ప్రదర్శించారు. 50 మంది నటీనటులు సాంకేతిక నిపుణులతో మూడున్నర గంటల సేపు ఈ నాటకం కొనసాగింది. నిర్వాహకులు ముందుగానే ప్రదర్శనని ప్రదర్శించారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కళాకారులు తమ నటన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

ఈ నాటకానికి ఎస్ ఎం.భాష వహించగా డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన నవల ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ నాటకం ఆహుతులను కట్టిపడేసింది. ఆధునిక మనిషిలోని మట్టి మనిషిని తట్టి లేపింది. రైతు జీవితాన్ని రైతు జీవన అనుభవాన్ని రంగరించి కుమ్మరించింది. ప్రకృతిని సమాజాన్ని చదవడం కూడా చదువుతో సమానమైనదనే సంకేతంతో భూమి ఉత్పత్తి సాధనం కానీ అది వ్యాపార వస్తువు కాదు. అనే నేపథ్యంతో మట్టికి మనిషికి ఉన్న సంబంధాన్ని తట్టి లేపింది. ఈ కార్యక్రమంలో అమరజీవి అన్న బత్తుల రవీంద్రనాథ్ కళా సంస్థ అధ్యక్షులు మోటమర్రి జగన్మోహన్ రావు, కార్యదర్శి ఏఎస్ కుమార్, ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగబత్తిని రవి, వేల్పుల విజేత, లక్ష్మీనారాయణ, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Next Story