కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుల ఎన్నిక

by Jakkula.Mamatha |

మండలంలోని సుద్దాల, బురుజుబావి గ్రామాలలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్త ఆధ్వర్యంలో నూతన కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుల ఎన్నిక
X

దిశ,గుండాల: మండలంలోని సుద్దాల, బురుజుబావి గ్రామాలలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్త ఆధ్వర్యంలో నూతన కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుద్దాల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గూడ రవి, యూత్ అధ్యక్షుడిగా యమగాని బాలకృష్ణ, బురుజుబావి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా వల్లాల మహేందర్, గ్రామ యూత్ అధ్యక్షుడిగా వల్లాల రవిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఇమ్మడి దశరథ గుప్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ, విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదేశానుసారం నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వల్లాల రమేష్, తండా నారాయణస్వామి, పొడిశెట్టి వెంకన్న, మండల యూత్ అధ్యక్షుడు మడూరి నరేష్ రెడ్డి,గూడ రవికుమార్, దంతూరి మల్లయ్య, దొడ్డబోయిన నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story