- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్డెన్ సెర్చ్.. నాటు సారా, మద్యం స్వాధీనం
ఆత్మకూరు సబ్-డివిజన్ పరిధిలో జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పర్యవేక్షణలో నందికొట్కూరు, వెలుగోడు, ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆదివారం

దిశ, ఆత్మకూరు: ఆత్మకూరు సబ్-డివిజన్ పరిధిలో జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పర్యవేక్షణలో నందికొట్కూరు, వెలుగోడు, ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నందికొట్కూరు పట్టణంలోని షికారి పేటలో ఆత్మకూరు సీఐ మహేశ్వర రెడ్డి, సిబ్బంది కలిసి నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అందులో 15 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వెలుగోడు మండలంలోని మోతుకూరు గ్రామంలో ఎస్ఐ, సిబ్బంది సోదాలు చేపట్టారు. అక్కడ 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మద్యం విక్రేతపై కేసు నమోదు చేశారు. ముచ్చుమత్రి పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో సోదాలు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ప్రజలకు సైబర్ మోసాలు, మహిళల రక్షణ, నాటుసారా, మద్యం అమ్మకాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.






