- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC Women's T20 World Cup: టాస్ గెలిచిన టీమిండియా.. ఓపెనర్ షఫాలి వర్మ ఔట్
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక మ్యాచ్ ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 (ICC Women's T20 World Cup) గ్రూప్-Aలో దాయాదుల పోరు మొదలైంది. ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్, పాకిస్తాన్ మహిళల జట్లు తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. టాస్ గెలిచి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు మొదటి ఓవర్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఐదో బంతికే ఓపెనర్ షఫాలీ వర్మ అవుటైంది. షఫాలీ వర్మ 5 బంతుల్లో 1 సిక్సర్‌తో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. దీంతో భారత్ 0.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. క్రీజులో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఉన్నారు.
హెడ్ టూ హెడ్.. భారత్‌దే పైచేయి
మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడగా.. అందులో భారత్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఓవరాల్ టీ20 రికార్డులను పరిశీలిస్తే, ఆడిన 16 మ్యాచ్‌ల్లో భారత్ 13 సార్లు, పాకిస్తాన్ 3 సార్లు గెలిచాయి. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
భారత తుది జట్టు (Playing XI):
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
పాకిస్థాన్ తుది జట్టు (Playing XI):
మునీబా అలీ (వికెట్ కీపర్), గుల్ ఫిరోజా, ఆయేషా జాఫర్, అలియా రియాజ్, నతాలియా పర్వైజ్, సైరా జబీన్, ఫాతిమా సనా (కెప్టెన్), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సాదియా ఇక్బాల్.






