సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు.. 145 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు

by Jakkula.Mamatha |

కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్‌‌లో సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంపు నిర్వహించారు.

సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు.. 145 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు ఆదేశాల మేరకు, సి‌ఎం‌ఓ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ సూచనల మేరకు సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమంలో భాగంగా ఆదివారం మెడికోవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ వారిచే కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్‌‌లో సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ లో కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ/ నెఫ్రోలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు సేవలు అందించారు.

ఈ సందర్భంగా సీఎం‌ఓ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ కార్మికుల, ఉద్యోగుల సంక్షేమం విషయంలో ముందు వరుసలో ఉంటుందని అన్నారు. సింగరేణి లో పనిచేసే ఉద్యోగులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో వారి సౌలభ్యం కోసం హైద్రాబాద్ లోని అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వారిచే సింగరేణి ఆసుపత్రులలోనే వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి రెండవ ఆదివారం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంపులను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంపులను కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ క్యాంప్‌లో పాల్గొన్నారు. మొత్తం 145 మంది రోగులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అడిషనల్ సీఎంవో ఉష పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంపులో డి‌వై.సి‌ఎం‌ఓ కే.నాగరాజు, హెల్త్ ఆఫీసర్ డి లలిత, మెయిన్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story