అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత

by Jakkula.Mamatha |

మండలంలోని అబ్బుగూడెం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: మండలంలోని అబ్బుగూడెం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇసుక రవాణాపై పక్కా సమాచారం అందుకున్న అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ విజయసింహ రెడ్డి తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. అబ్బుగూడెం గ్రామం మీదుగా అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను ఎస్ఐ విజయసింహ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ విజయసింహ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మండలంలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలను సహించేది లేదని, నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

Next Story