వైసీపీ సోషల్ మీడియా ఖాతా నిలిపివేత.. ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-14 15:01:38  IST  )

వైసీపీ సోషల్ మీడియా ఖాతాను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ సోషల్ మీడియా ఖాతా నిలిపివేత.. ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సోషల్ మీడియా ఖాతా(YCP social media account)ను కూటమి ప్రభుత్వం(Aliance Government) నిలిపివేసిందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారనే కక్షతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ను నిలిపివేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా ఫేస్ బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిందని జగన్ ఆరోపించారు.

భావ ప్రకటన స్వేచ్ఛకు సంకేళ్లు..

ఇది కేవలం తమ పార్టీపై చేసిన దాడి మాత్రమే కాదని, భావ ప్రకటన స్వేచ్ఛకు సంకేళ్లు వేయడమేనని జగన్ అభివర్ణించారు. సత్యాలు మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్తున్న తమ పార్టీ ఫేస్ బుక్ ఖాతాలను ఇలా బలవంతంగా మూసివేయించడం అప్రజాస్వామికమని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామనే కోపంతోనే తమను నిరోధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వ చర్యలను, బెదిరింపులను అన్ని విధాలుగా ఎదుర్కొంటామని జగన్ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు నిలదీస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడాలని, తమ ఫేస్ బుక్ ఫేజీని పునరుద్ధరించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

Next Story