పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..

by Kodari Anjali |

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఒకే చోట చదువుకున్న పదవ తరగతి విద్యార్థులంతా నేడు కలుసుకుని అప్యాయంగా పలకరించుకున్నారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..
X

దిశ, జోగులాంబ ప్రతినిధి: ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఒకే చోట చదువుకుని ప్రస్తుతం ఉన్నత స్థాయిలలో కొనసాగుతున్న పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం మల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆనందోత్సాహాల మధ్య జరిగింది. మల్దకల్ జడ్పీ హైస్కూల్లో 1994-95 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఎన్నో ఏళ్ల తర్వాత ఒకే చోట చేరి ఆత్మీయంగా కలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులను పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు తెలుసుకుని ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత అనుబంధాలను మరింత బలపరిచారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Next Story