- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. NIOS 10వ తరగతి ఫలితాలు విడుదల
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ఏప్రిల్/మే 2026 సెషన్‌లో నిర్వహించిన 10వ తరగతి (సెకండరీ) పబ్లిక్ పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కుల స్కోర్‌కార్డ్‌ను results.nios.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇంటర్‌నెట్ అందుబాటులో లేని వారు మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. మొబైల్ మెసేజ్ బాక్స్‌లోకి వెళ్లి NIOS10 <ఎన్‌రోల్‌మెంట్ నంబర్> అని టైప్ చేసి 56263, 5676750 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే, ఫలితాలు నేరుగా మొబైల్‌కు వస్తాయి.
అదేవిధంగా విద్యార్థులు డిజీలాకర్ యాప్, వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి ఎడ్యుకేషన్ సెక్షన్‌లో NIOS బోర్డును ఎంచుకుని కూడా తమ డిజిటల్ మార్కు షీట్‌ను కూడా సేవ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న ప్రొవిజనల్ మార్క్‌షీట్‌లో విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, ఎన్‌రోల్‌మెంట్ నంబర్, పుట్టిన తేదీ, సబ్జెక్టుల వారీగా వచ్చిన థియరీ, ప్రాక్టికల్ మార్కులు, మొత్తం మార్కులు, పాస్/ఫెయిల్ (Qualifying Status) వంటి వివరాలు ఉంటాయి. ఏవైనా తప్పులు ఉంటే విద్యార్థులు ఫలితాలు వచ్చిన 15 రోజుల్లోగా కరెక్షన్ లేదా రీ-చెకింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.






