- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీవ్ గాంధీ నగర్ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
కొత్తపేట్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మాజీ జీహెచ్ఎంసీ వార్డ్ మెంబర్ మల్లెపాక యాదగిరి ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు.

దిశ, చైతన్యపురి: కొత్తపేట్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మాజీ జీహెచ్ఎంసీ వార్డ్ మెంబర్ మల్లెపాక యాదగిరి ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు. బస్తిలో నూతన మహిళా భవన్, బ్యాలెన్స్ కమిటీ హాల్ నిర్మాణం చేయాలని పేర్కొన్నారు.
తక్కువ ప్రెషర్‌తో వస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరించి 20 ఏళ్ల నాటి పాడైపోయిన డ్రైనేజీ లైన్లు, సీసీ రోడ్లు పునరుద్ధరించాలని కోరారు. గత ప్రభుత్వంలో మిగిలిపోయిన జీవో 58, 59 పట్టాల రెగ్యులరైజేషన్ పూర్తి చేయాలన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని అధికారులతో మాట్లాడి పెన్షన్లు అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి చాంద్ పాషా, వరకాల బిక్షపతి, శ్రీనివాసరావు, పల్లెర్ల యాదగిరి, తగిలి యాదగిరి, పోచమ్మ, మైసమ్మ, ఫాతిమా, సుగుణ, లలిత, పుష్ప, గురుదీప్ కౌర్ తదితరులున్నారు.






