జూనియర్ కెమిస్ట్, టెక్నికల్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్ష పూర్తి.. 17 పోస్టులకు 642 మంది హాజరు

by Jakkula.Mamatha |

సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్‌స్పెక్టర్–టీ&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత అభ్యర్ధులతో భర్తీ చేయుటకు ఈ రోజు సింగరేణి మహిళా డిగ్రీ& పి‌జి, జూనియర్ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు.

జూనియర్ కెమిస్ట్, టెక్నికల్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్ష పూర్తి.. 17 పోస్టులకు 642 మంది హాజరు
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్‌స్పెక్టర్–టీ&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత అభ్యర్ధులతో భర్తీ చేయుటకు ఈ రోజు సింగరేణి మహిళా డిగ్రీ& పి‌జి, జూనియర్ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్‌స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి ‘17’ ఖాళీలకు గాను అర్హులైన 695 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా, 642 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ రాత పరీక్ష సెక్యూరిటీ, విజిలెన్స్ & సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో, సీసీ కెమెరాల నిఘా మధ్య నిర్వహించడం జరిగింది. సింగరేణి మహిళా డిగ్రీ& పి‌జి, జూనియర్ కళాశాలలో జరిగిన ఈ పరీక్షను జి‌ఎం(పర్సనల్) ఈ‌ఈ & ఆర్‌సి ఏ.జే.ఎం మురళీధర రావు, ఏ‌జి‌ఎం(విజిలెన్స్) లు పర్యవేక్షించారు.

పరీక్ష పూర్తిగా మెరిట్ పై ఆధారపడి ఉంటుందని, దళారులకు ఎలాంటి ప్రమేయం ఉండదని, వారిని నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఈ పరీక్ష ఫలితాలు ఆదివారం రాత్రి నుంచే సింగరేణి వెబ్ సైట్ మరియు సింగరేణి ప్రధాన కార్యాలయం ముఖద్వారం వద్ద నోటీసు బోర్డు ద్వారా తెలియజేయడం జరుగుతుంది అన్నారు. ఈ పరీక్ష నిర్వహణ పరీశీలనలో జి‌ఎం(పర్సనల్) ఈ‌ఈ & ఆర్‌సి ఏ.జే.ఎం మురళీధర రావు, ఏ‌జి‌ఎం(విజిలెన్స్) ఎస్.వి.మురళీధర రాజు, డి‌జి‌ఎం(పర్సనల్) పి.వేణు గోపాల రావు, పర్సనల్ మేనేజర్ బి.సమ్మయ్య డి‌వై.పి‌ఎంలు డి.నాగేశ్వర రావు, కే.సంతోష్ కుమార్, విజిలెన్స్ ఆఫీసర్స్ ఎస్‌డి.షాకిర్ మొహినుద్దీన్, ఎం‌డి.హషిం పాషా, సింగరేణి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ టి.సంధ్యారాణి, డిగ్రీ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.మంజుల, ఇతర అధికారులు, విజిలెన్స్ & సెక్యూరిటీ సిబ్బంది, రిక్రూట్మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story