- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నర్సింహులపేట మండలంలో భారీ కార్డన్ సెర్చ్
మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నర్సింహులపేట మండలంలోని పలు తండాల్లో ఆదివారం భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

దిశ, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నర్సింహులపేట మండలంలోని పలు తండాల్లో ఆదివారం భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తొర్రూరు డీఎస్పీ పర్యవేక్షణలో, తొర్రూరు సీఐ ఆధ్వర్యంలో నర్సింహులపేట, దంతాలపల్లి, పెద్దవంగర, తొర్రూరు ఎస్‌ఐలు మరియు సర్కిల్ సిబ్బంది కలిసి ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు గోప తండా, వస్రం తండా, మూడు తండా, జగ్గు తండా, లాలి తండాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 550 లీటర్ల బెల్లం పానకం, 32 లీటర్ల గుడుంబా (నాటు సారాయి), 50 కిలోల నల్ల బెల్లం, 3 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లో కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది కలిపి సుమారు 40 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జగ్గు తండా, వస్రం తండా, గోప తండాల్లో గుడుంబా తయారీ, నిల్వలకు సంబంధించి పలు కేసులు నమోదు చేశారు. అలాగే 28 లీటర్ల ఐడీ మద్యం, 100 లీటర్లకు పైగా బెల్లం వాష్, 3 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, గుడుంబా వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నివారణపై పోలీసులు అవగాహన కల్పించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని అధికారులు కోరారు.






