- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపై పడ్డ వ్యర్ధాలు... పడిపోయిన ప్రయాణికులు
జిహెచ్ఎంసి చెత్త లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం.. పలువురు వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది.

దిశ, కాప్రా: జిహెచ్ఎంసి చెత్త లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం.. పలువురు వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. ఆదివారం నగరం నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌కు తరలించే ఓ చెత్త లారీ నుంచి వ్యర్ధాల మూటలు ఈసీఐఎల్ చౌరస్తాలో అను మెస్ హోటల్ సమీపంలో చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఈ మూటల్లో జిగురైన పదార్థములు ఉండటంతో.. ఆ రోడ్డు గుండా ప్రయాణించే పలువురు వాహనదారులు అదుపుతప్పి కింద పడ్డారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు వానదారులు కిందపడడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డట్టు స్థానికులు వాపోయారు. అయితే చెత్తను తరలించే డ్రైవర్లు విధిగా లారీపై తాటిపర్తిలను కట్టాలనే నిబంధన ఉంది. అయితే కొంతమంది లారీ డ్రైవర్లు ఏలాంటి తాటిపత్రులను కట్టకుండానే చెత్తను లారీల్లో డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నారు.
జిగురైన పదార్థాల నుంచి ప్రయాణిస్తూ..
ఈ క్రమంలో లారీలపై నిండుగా ఉన్న చెత్త మూటలు, ఇతర వ్యర్ధాలు రోడ్డుపైన పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అలాగే భరించలేని దుర్వాసనతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఓ చెత్త లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆదివారం ఈసీఐఎల్ చౌరస్తాలో రోడ్డుపై చెత్త పడడంతో.. దానిపై నుంచి వెళ్లిన పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. అయితే వాహనదారులు జిగురైన పదార్థాల నుంచి ప్రయాణిస్తూ అదుపుతప్పి పడుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు గమనించి జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇక రోడ్డుపై పడిపోయిన వ్యర్ధాలను ఎత్తి వేశారు. అయితే అదుపుతప్పి పడిపోయిన వాహనదారులలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి గంటపాటు కోలుకోలేదని స్థానికులు తెలిపారు. అయితే ఇలాంటి సంఘటనలో ఎవరైనా మృతిచెందితే దానికి బాధ్యులు ఎవరని స్థానికులు ప్రశ్నించారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు చెత్తను తరలించే లారీల్లో నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.






