- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: మళ్లీ అఘోరీ ఎంట్రీ.. ఈ సారి ఏ అమ్మాయితోనంటే..?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘లేడీ అఘోరీ’ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘లేడీ అఘోరీ’ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చాడు. గతంలో పలువురు మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలతో జైలు పాలైన ఇతడు, తాజాగా మరో యువతితో కలిసి ఉన్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఆ యువతి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘శీనుగా.. నీకు పెండ్లిగాని మగపోరల ఉసురు తలుగుడు పక్కారా’ అంటూ ఓ నెటిజన్ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వీడియో పోస్ట్ చేశారు.
వైరల్ వీడియోలో అఘోరీ శ్రీనివాస్ చేతిలో పెంపుడు కుక్కను పట్టుకుని కనిపించాడు. పక్కనే యువతి అతనితో సరదాగా సంభాషణ చేస్తోంది. చుట్టు పక్కల రాజస్థాన్ నెంబర్ ప్లేట్ గల కార్లు వీడియోలో కన్పిస్తున్నాయి.
వర్షిణితో రహస్య వివాహం..
గతంలో ఏపీలోని మంగళగిరి ప్రాంతానికి చెందిన వర్షిణి అనే బీటెక్ విద్యార్థినిని మత్తుమందు ఇచ్చి, వశపరుచుకుని కిడ్నాప్ చేసినట్లు శ్రీనివాస్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆమెను మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన తలంబ్రాల వీడియోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. తమ కుమార్తెను, కుమారుడిని శ్రీనివాస్ ఇంట్లోనే లైంగికంగా వేధించాడంటూ వర్షిణి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీనివాస్ చెర నుంచి వర్షిణిని రక్షించారు. అతనొక మోసగాడని వర్షిణి ఆ తర్వాత అతడి నుంచి విడిపోయింది.
మహిళా ప్రొడ్యూసర్‌కు బ్లాక్‌మెయిల్..
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన ఒక మహిళా ప్రొడ్యూసర్‌ను సైతం ఇతడు ఘోరంగా మోసం చేసినట్లు ఆరోపించింది. సమస్యలు తీరుస్తానని నమ్మించి ‘యోని పూజ’ పేరుతో ఆమె వద్ద నుంచి ఏకంగా రూ.10 లక్షలు వసూలు చేశాడని.. అదనంగా మరో రూ.5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే మంత్ర శక్తులు, చేతబడులతో కుటుంబాన్ని అంతమొందిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని.. బాధితురాలి ఫిర్యాదుతో మోకిలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న ఇతడిని యూపీ సరిహద్దుల్లో అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
బలవంతపు పెళ్లిళ్లు, లైంగిక వేధింపులు
శ్రీనివాస్ అరెస్ట్ అయిన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కరీంనగర్‌కు చెందిన మరో మహిళ మీడియా ముందుకు వచ్చి, గతంలో తనను కూడా బలవంతంగా తాళి కట్టి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ని క్రిమినల్ కేసులు, నేర చరిత్ర ఉన్నప్పటికీ.. తాజాగా అఘోరీ శ్రీనివాస్ మరో కొత్త అమ్మాయితో వీడియోల్లో దర్శనమివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






