- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోహన్ లాల్‌తో సినిమా.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’తో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ చిదంబరం నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘బాలన్- ది బాయ్’.

దిశ, సినిమా: మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’తో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ చిదంబరం నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘బాలన్- ది బాయ్’. ‘ఆవేశం’ ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ స్క్రిప్ట్ అందించిన ఈ చిత్రం ఈనెల 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న డైరెక్టర్ చిదంబరం.. మలయాళ స్టార్ మోహన్ లాల్‌తో సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ‘నేను మోహన్ లాల్‌తో ప్రాజెక్టు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. సాధారణంగా కొన్ని సందర్భాల్లో మోహల్ లాన్‌ను కలిసిన్పటికీ ప్రాజెక్టు గురించి మాత్రం మేము ఎప్పుడు చర్చలు జరపలేదు. ఒకవేళ ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం.. ఆ సినిమా ప్రేక్షకులు ఆశించే అద్భుతమైన సన్నివేశాలతో పాటు ఎంటర్‌టైనింగ్ చిత్రంగా తెరకెక్కిస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. ఇటీవల ఓ మీడియా సమావేశంలో డైరెక్టర్ చిదంబరం తండ్రి.. మోహన్ లాల్‌తో చిదరంబం నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఈ వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో డైరెక్టర్ తండ్రే స్వయంగా చెప్పడంతో వీరిద్దరి కాంబోలో ప్రాజెక్టు ఓకే అయినట్లు అందరూ భావించారు. కానీ తన త్రండి ఏదో వదంతి విని దానిని సోషల్ మీడియాలో పంచుకుని ఉండొచ్చని, నేను మోహన్ లాల్‌తో ఎలాంటి ప్రాజెక్టు ఓకే చేయలేదంటూ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ చిదంబరం.






