ఎన్టీఆర్ మాట వినకుండా వెళ్లా.. యాక్సిడెంట్ అయ్యింది.. ఎమోషనల్ అయిన చిత్రం శ్రీను

by Pulgam srinivas |   (  Updated:2026-06-14 10:34:59  IST  )

“నాకు యాక్సిడెంట్ అయ్యాక ఎన్టీఆర్ స్వయంగా ఇంటికి వచ్చి ఓ చెక్ ఇచ్చి, ఎంత కావాలో రాసుకోమని చెప్పారని” చిత్రం శ్రీను వెల్లడించాడు.

ఎన్టీఆర్ మాట వినకుండా వెళ్లా.. యాక్సిడెంట్ అయ్యింది.. ఎమోషనల్ అయిన చిత్రం శ్రీను
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు చిత్రం శ్రీను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రయాణంలో ఎదురైన కొన్ని ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్ ప్రారంభ రోజుల్లో జరిగిన ప్రమాదం, ఆ సమయంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ తనపై చూపిన అభిమానాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా “మీ కెరీర్ ప్రారంభంలో కాలికి యాక్సిడెంట్ అయినప్పుడు ఓ స్టార్ హీరో మీ ఇంటికి వచ్చి చెక్ ఇచ్చి, ఎంత కావాలో రాసుకోమన్నారట.. ఆ విషయం ఏమిటి?” అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన చిత్రం శ్రీను, “ఆ విషయం చెప్పాలంటే ముందు జరిగిన కథ కూడా చెప్పాలి” అంటూ వివరించారు.

నేను కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నిన్ను చూడాలని’ సినిమాలో నటించాను. ఆ సినిమాకు ప్రతాప్ గారు దర్శకుడు. ఆ సినిమా సమయంలో ఎన్టీఆర్ గారు నాతో చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఇప్పటికీ అలాగే ఉంటారు. ఒక రోజు ‘నిన్ను చూడాలని’ సినిమా షూటింగ్ జరుగుతుండగా, మధ్యాహ్నం నాకు ‘నువ్వు నేను’ సినిమా షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. దాంతో నేను అక్కడికి వెళ్లాలని ఎన్టీఆర్ గారికి చెప్పాను. అయితే ఆయన ‘ఎందుకు వెళ్తావు.. ఇక్కడే ఉండు’ అన్నారు. కానీ నేను ‘అది కూడా చాలా పెద్ద సినిమా.. కచ్చితంగా వెళ్లాలి’ అని చెప్పి బయలుదేరాను అని తెలిపారు. మధ్యలో నాకు యాక్సిడెంట్ జరిగింది. ఆ విషయం తెలిసి ఎన్టీఆర్ గారు చాలా షాక్ అయ్యారట.

ఉదయం వరకూ మనతో ఎంతో సరదాగా ఉన్న వ్యక్తికి ఇలా ఎలా జరిగిందని యూనిట్ సభ్యులతో మాట్లాడారట. తర్వాత నన్ను హాస్పిటల్ నుంచి కృష్ణానగర్‌లోని రూమ్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ అంబాసిడర్ కారులో చాలా కొబ్బరి బోండాలు తీసుకుని నన్ను చూడటానికి వచ్చారు. నాతో కాసేపు మాట్లాడిన తర్వాత ఒక చెక్ ఇచ్చి, ‘నీ పరిస్థితి ఇప్పుడు బాగోలేదు.. ఎంత కావాలో ఇందులో రాసుకుని తీసుకో’ అన్నారు. నేను వద్దన్నా ఆయన వినలేదు అని గుర్తుచేసుకున్నారు. నాకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎన్టీఆర్ గారు అంతలా కేర్ తీసుకోవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చిత్రం శ్రీను ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మోహన్ లాల్‌తో సినిమా.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Next Story