- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇథనాల్ బైక్‌ల పెట్రోల్ ట్యాంకుల వద్ద చీమలు, కందరీగలు.. వైరల్ వార్తల వెనుక అసలు నిజం!
పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ను చెరకు, ధాన్యాల నుండి తయారు చేయడం వల్ల వచ్చే తీపి వాసనకు కీటకాలు ఆకర్షితులవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20 Fuel)కు అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ ఇథనాల్ వాడుతున్న వాహనాలపై, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల ఇంధన ట్యాంకులు, పైపుల వద్ద ఈగలు, చీమలు, కందిరీగలు, కొన్ని రకాల వండ్లు (బీటిల్స్) వాడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీని వెనుక ఎటువంటి కల్తీ లేదని, పూర్తి శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ను చెరకు రసం, మొలాసిస్, పాడైపోయిన ధాన్యం, మొక్కజొన్న వంటి వాటిని పులియబెట్టడం (ఫెర్మెంటేషన్) ద్వారా తయారు చేయడం వల్ల ఇంధనానికి ఒక రకమైన తీపి లేదా ఆల్కహాల్ వాసన (Sweet Smell) వస్తుంది. ఈ వాసన కీటకాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. వీటికి తోడు 'అంబ్రోసియా బీటిల్స్' (Ambrosia Beetles) అనే ఒక రకమైన పండ్లు కుళ్ళిపోయిన చెట్ల నుండి వచ్చే ఇథనాల్ వాసనను బట్టి గుడ్లు పెట్టడానికి అలవాటు పడతాయి. వాహనాల నుంచి వచ్చే ఈ ఇథనాల్ వాసనను చూసి అవి చెట్టు కొమ్మలుగా భ్రమపడి, ఇంధన గొట్టాలకు రంధ్రాలు (Bore Holes) చేస్తుండటంతో పెట్రోల్ లీక్ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. అలాగే ఇథనాల్‌కు గాలిలోని తేమను ఆకర్షించే గుణం ఉండటం వల్ల కూడా కీటకాలు గుంపులుగా వచ్చి వాలుతున్నాయి.
ఈ నేపథ్యంలో వాహనదారులు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్ ట్యాంక్ క్యాప్ లూజ్‌గా లేకుండా గ్యాస్కెట్ సరిగ్గా ఉండేలా చూసుకోవడం ద్వారా ఇంధన వాసన బయటకు రాకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. వాహనం కింద పెట్రోల్ లీక్ అవుతుందా లేదా పైపులపై చిన్న రంధ్రాలు పడ్డాయా అనేది తరచూ గమనిస్తూ ఉండాలి. పాత రబ్బర్ గొట్టాల స్థానంలో ఇథనాల్ నిరోధకత (Ethanol Resistant) కలిగిన నాణ్యమైన దట్టమైన పైపులను అమర్చుకోవడం సురక్షితం. వాహనాలను ఎండలో పార్క్ చేయడం వల్ల ట్యాంకులో ఇంధనం ఆవిరిగా మారి ప్రెజర్ పెరిగి వాసన బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బైక్‌లను ఎల్లప్పుడూ నీడలో, కవర్ వేసి పార్క్ చేయాలని వాహనదారులకు నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.






