Earthquake:అర్ధరాత్రి ఉలిక్కిపడ్డ భద్రాద్రి.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-14 09:56:34  IST  )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.

Earthquake:అర్ధరాత్రి ఉలిక్కిపడ్డ భద్రాద్రి..  భయంతో పరుగులు తీసిన ప్రజలు
X

దిశ, పాల్వంచ టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల 26 నిమిషాల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. భూకంప ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు అనుభూతి కావడంతో ప్రజలు ఒక్కసారిగా అప్రమత్తమై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదైనప్పటికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంపం అనంతరం పరిస్థితిని అధికారులు పరిశీలించగా ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు కనిపించలేదని వెల్లడించారు.

దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే.. పాల్వంచ పట్టణం గట్టాయిగూడెంకు చెందిన లింగం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. “తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంట్లో మంచం, తలుపులు స్వల్పంగా కదిలినట్లు అనిపించింది. మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు. కొద్దిసేపటికే భూమి కంపించినట్లు గుర్తించి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి బయటకు వచ్చాం. చుట్టుపక్కల వారు కూడా భయంతో బయటకు రావడం కనిపించింది. అయితే ప్రకంపనలు స్వల్పంగానే ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు” అని తెలిపారు.

Next Story