నేరెళ్లలో భారీ చోరీ.. 7 తులాల బంగారం రూ.1.10లక్షల నగదు ఆపహరణ

by Kodari Anjali |

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఓ తాళం వేసి ఉన్న ఇంటిలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది.

నేరెళ్లలో భారీ చోరీ..  7 తులాల బంగారం రూ.1.10లక్షల నగదు ఆపహరణ
X

దిశ, వెల్గటూర్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఓ తాళం వేసి ఉన్న ఇంటిలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు బ్రేక్ చేసి లోనికి చొరబడి 7 తులాల బంగారం రూ.1.10 నగదు చోరీకి పాల్పడి సంచనలం సృష్టించారు. వివరాల్లోకెళ్తే.. ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మామిడిపల్లి గోపాల్ తన కుటుంబంతో కలిసి మనుమడి శుభకార్యం కోసం రెండు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లారు. ఇంటిని తరచుగా చూసుకోవాలని తమ్ముడు సత్తయ్యకు చెప్పి వెళ్ళాడు. అప్పటి నుంచి సత్తయ్య రాత్రి పూట ఇంటిముందర లైట్ వేయటం.. తెల్లవారి లైట్ తీయటం చేస్తున్నాడు. అదే క్రమంలో ఆదివారం ఉదయం లైట్ బంద్ చేయటానికి వెళ్ళాడు. అన్న ఇంటి మెయిన్ డోర్ తలుపులకు వేసిన తాళం బ్రేక్ చేసి ఉండటాన్ని గమనించి సర్పంచ్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ధర్మపురి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారోచ్చి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం సహకారంతో వివరాలు సేకరించారు. తాళాలు బ్రేక్ చేసి చోరీ జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు ఈ చోరీలో 7 తులాల బంగారంతో పాటు రూ. 1.10 నగదు చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story