జీతాల పెంపు ప్రతి నెల శాలరీ అకౌంట్‌లోనే: మంత్రి సీతక్క

by Kodari Anjali |

బిల్ కలెక్టర్లు, కరోబార్ల సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

జీతాల పెంపు ప్రతి నెల శాలరీ అకౌంట్‌లోనే: మంత్రి సీతక్క
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ "సీతక్క" గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. బిల్ కలెక్టర్లు, కరోబార్ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ప్రతినెల జీతాలను పెంచి ప్రతి నెల నేరుగా వారి శాలరీ అకౌంట్‌లోనే జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహులు, పిల్లి రవి యాదవ్, నాగరాజు, శ్రీధర్, సురేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొని మంత్రికి వినతిపత్రం భరోసా ఇచ్చారు.

Next Story