ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి

by Taduka Kalyani |

మండల పరిధిలోని ఇప్పలగూడెం సమీపంలోని మూల మలుపు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి
X

దిశ, వెంకటాపురం(నూగూరు): మండల పరిధిలోని ఇప్పలగూడెం సమీపంలోని మూల మలుపు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే, ఏటూరునాగారం మండలం ఏలిశెట్టిపల్లికి చెందిన నూకల మహేష్, మడప నందయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం వెంకటాపురం ప్రాంతానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఇప్పలగూడెం సమీపంలో వారి ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మడప నందయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో నూకల మహేష్‌కు చేయి విరగడంతో పాటు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story