నీట్ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల.. 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామినేషన్

by Kema Shiva Kumar |

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 21న నిర్వహించనున్న నీట్ యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.

నీట్ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల.. 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామినేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 21న దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) రీ-ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 వరకు జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ ఇవాళ విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in నుంచి తమ లాగిన్ వివరాలను ఉపయోగించి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే ముందే, ఫీజు రీఫండ్ కొరకు తమ బ్యాంక్ ఖాతా వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. అడ్మిట్ కార్డులోనే అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రం వివరాలు ఉంటాయని, కార్డుపై ఉన్న సూచనలను, సమాచార బులెటిన్‌ను పూర్తిగా చదువుకోవాలని స్పష్టం చేశారు.

సాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు..

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అభ్యర్థులు 011-40759000, 011-69227700 నంబర్లలో సంప్రదించవచ్చని, [email protected] ఈ-మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చని ఎన్టీఏ డీజీ తెలిపారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు నిరంతరం https://www.nta.ac.in మరియు https://neet.nta.nic.in వెబ్‌సైట్లను పరిశీలించాలని కోరారు.

Next Story