- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: మెక్సికో (Mexico) వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) ఫుట్‌బాల్ మ్యాచ్‌లు క్రీడాభిమానులను కట్టిడేస్తున్నాయి. ఈ క్రమంలోనే టోర్నీ నిర్వాహకులు మ్యాచ్‌లు సక్రమంగా జరిగేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్టేడియం ప్రాంగణంలోకి మద్యం తీసుకెళ్లడం, తాగడంపై కఠిన ఆంక్షలు విధించారు. దీంతో ఓ ఫుట్‌బాల్ అభిమాని మాత్రం ఎవరికీ దొరక్కుండా ‘మందు’బాబులకే మైండ్ బ్లాక్ అయ్యేలా ఓ క్రేజీ ఐడియా వేశాడు.
మొబైల్ ఫోన్ బ్యాక్ కవర్‌లోనే లిక్కర్..
సాధారణంగా స్టేడియంలోకి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ సిబ్బంది బ్యాగులను, ఇతర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేవలం మొబైల్ ఫోన్లను మాత్రం అనుమతిస్తారు. అయితే, దీనినే ఓ వ్యక్తి అడ్వాంటేజ్‌గా తీసుకుని స్పెషల్ ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్, సిలికాన్ మొబైల్ బ్యాక్ కవర్‌ను ఉపయోగించాడు. ఆ కవర్ లోపల ఖాళీ స్థలంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని నింపి స్టేడియంలోకి ఎంటరయ్యాడు. సెక్యూరిటీ అతడి ఫోన్‌ను చెక్ చేసినప్పటికీ అదొక మొబైల్ కవర్ (Mobile Cover) లాగే కనిపించడంతో లోపలికి పంపేశారు. ఇక గ్యాలరీలో కూర్చున్న తర్వాత.. సదరు వ్యక్తం తన ఫోన్ కవర్ అంచున ఉన్న ఒక చిన్న నాజిల్ క్యాప్ తీసి మద్యాన్ని గ్లాసులో పోసుకుని తాగుతూ మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేశాడు. అయితే, అతడు ఫోన్ కవర్‌లో ఉన్న మద్యాన్ని గ్లాసులో పోస్తున్న దృశ్యాలను పక్కనున్న వారు రికార్డ్ చేసి సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేశారు. ఆ షార్ట్ వీడియో కాస్ట నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు ‘రూల్స్ బ్రేక్ చేయడంలో వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా’, ’ఇలాంటి ఐడియాలు వీళ్లకే వస్తాయి’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.






