- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ బడుల విద్యార్థుల జయకేతనం..
బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు.

దిశ, ఆదిలాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు.ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు చెందిన 65 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.మొదటి విడతలో 58 మంది,రెండో విడతలో మరో 7 మంది ఎంపికయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా,వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ప్రశంసించారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, డిజిటల్ బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, అల్పాహారం,మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ బడులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నాయని పేర్కొన్నారు.






