- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరి ట్రావెల్స్ యజమాని ఇంటి ముందు మృతదేహంతో ధర్నా.. కారణమిదే!
by Jakkula.Mamatha |
భద్రాచలానికి చెందిన సన్నీ అనే డ్రైవర్ అశ్వాపురం మండలం మొండికుంట ప్రాంతంలో శనివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు.

X
దిశ, భద్రాచలం: భద్రాచలానికి చెందిన సన్నీ అనే డ్రైవర్ అశ్వాపురం మండలం మొండికుంట ప్రాంతంలో శనివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సన్నీ అనే వ్యక్తి సిరి ట్రావెల్స్ లో చాలా కాలం నుంచి పర్మినెంట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదం జరిగి మరణించిన, సిరి ట్రావెల్స్ యజమాని స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మృతుడి కుటుంబ సభ్యులు భద్రాచలం ఐటీడీఏ రోడ్డు రూప స్కూల్ ప్రక్కన సిరి ట్రావెల్స్ యజమాని ఇంటి ముందు మృతదేహంతో ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Next Story






