- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూమన హిందూ వ్యతిరేకి.. తరిమికొట్టాలి: ఏపీ సాధు పరిషత్
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణారెడ్డిపై ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై బ్లాక్ టికెట్లు అమ్ముతారని తనపై భూమన చేసిన విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణారెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy)పై ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణ(AP Sadhu Parishad Honorary President Atluri Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల(Tirumala) కొండపై బ్లాక్ టికెట్లు అమ్ముతారని తనపై భూమన చేసిన విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. భూమన కరుణాకర్ రెడ్డి హిందూ వ్యతిరేకని ఆయనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సేవా టికెట్ల విషయంలో తాను చర్చకు సిద్ధమని, ఎక్కడి రమ్మన్నా వస్తానని అట్లూరి నారాయణ సవాల్ విసిరారు.
భూమనపై శ్రీనివాసానంద సరస్వతి ఫైర్
కొందరు స్వామీజీలు టీడీపీ జెండాలు మోసే కూలీలని భూమన విమర్శించడంపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉండగా దేవాలయాలపై దాడులు జరిగాయని, అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. స్వామీజీలపై నిరాధార ఆరోపణలు సరికాదని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి వ్యాఖ్యానించారు






