కేటీఆర్ దమ్ముంటే నిజాలు మాట్లాడాలి: కాంగ్రెస్ మండల అధ్యక్షులు

by Kodari Anjali |

బీఆర్ ఎస్ కేటీఆర్ పాలనంతా దోపిడీ మయమేనని కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ అన్నారు.

కేటీఆర్ దమ్ముంటే నిజాలు మాట్లాడాలి: కాంగ్రెస్ మండల అధ్యక్షులు
X

దిశ, తంగళ్లపల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దమ్ముంటే నిజాలు మాట్లాడాలని, బీఆర్ ఎస్ కేటీఆర్ పాలనంతా దోపిడీ మయమేనని కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సెస్ ను ఎన్పీడిసీఎల్‌లో ఎందుకు విలీనం చేసామో మాజీ ఎంపీ వినోద్ కుమార్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యను అడిగితే బాగుంటుందన్నారు. మీ ధన దాహానికి అడ్డుపడుతున్నామనే అసత్య ప్రచారాలు సిరిసిల్లపై చిత్తశుద్ధి ఉంటే నిజాలు మాట్లాడాలన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తే ఊరుకోనే ప్రసక్తే లేదన్నారు. మార్పు కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి బీఆర్ఎస్ ను బొంద పెట్టారన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే అభద్రత భావంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. నిజంగా సిరిసిల్లపై చిత్తంశుద్ధి ఉంటే నిజాలు మాట్లాడాలన్నారు. సిరిసిల్ల ప్రాంతం అభివృద్ధి అయిందని జీవన్ రెడ్ది అనడం విడ్డురమని,

దొంగే దొంగన్నట్లుగా కేటీఆర్ మాటలున్నాయి..

గతంలో బీఆర్ఎస్ పార్టీనీ విమర్శించిన తీరు అందరికి తెలుసునన్నారు. కేటీఆర్ మెప్పు కోసం అసత్యపు మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సెస్ లో ఎన్నో అక్రమాలు జరిగిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మీరు గతంలో ఎన్ని అక్రమాలు జరిగాయో అందరికి తెలుసన్నారు. కేటీఆర్ నిజాలు మాట్లాడాలని, అధికారం కోల్పోయి పిచ్చి మాటలు మాట్లాడవద్దన్నారు. దొంగే దొంగన్నట్లుగా కేటీఆర్ మాటలు ఉన్నాయని విమర్శించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు, మీ అనుచరులు చేసిన దోపిడీని ఒక్కొక్కటిగా ఎండగట్టి, బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ పొన్నాల పరశురాం, ఆరెపల్లి బాలు, నాయకులు మచ్చ శ్రీనివాస్, గుగ్గిళ శ్రీకాంత్ గౌడ్, బైరినేని రాము, మునిగల రాజు, గడ్డం మధుకర్, మిరల శ్రీనివాస్, కొత్త రవి, గుగ్గిళ్ల భరత్, పయ్యావుల శ్రీనివాస్, బండి పరుశురాం, చిలుక శ్రీనివాస్, ప్రేమ్ లు పాల్గొన్నారు.

Next Story