- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికాసం పాఠశాలలో దివ్యాంగ బాలికలకు అవకాశం: పీవో రాహుల్
భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నడపబడుతున్న వికాసం పాఠశాలల్లో గిరిజన విద్యార్థులే కాకుండా ఎవరైనా దివ్యాంగ బాలికలకు ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు

దిశ, భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నడపబడుతున్న వికాసం పాఠశాలల్లో గిరిజన విద్యార్థులే కాకుండా ఎవరైనా దివ్యాంగ బాలికలకు ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. వికాసం పాఠశాలలో చేరే బాల బాలికలకు గ్రూప్ హియరింగ్ ఎయిడ్, ఆడియో మెట్రి, స్పీచ్ థెరపీ, కంప్యూటర్ ల్యాబ్ మరియు టైలరింగ్ శిక్షణ నేర్పించడంతో పాటు సాంస్కృతిక, నృత్య శిక్షణ నిపుణులైన ఉపాధ్యాయులచే అందించడం జరుగుతుందని, దానితోపాటు స్కూల్ యూనిఫార్మ్స్, రెండు జతలు ట్రాక్ షూస్, స్లిప్పర్స్, షూస్ సాక్స్, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్, మంచాలు, పరుపులు, దిండ్లు, ప్లేట్, గ్లాస్, కాస్మోటిక్ అందించడం జరుగుతుందని తెలిపారు.
అలాగే ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం.. ఆహారం అందించడం జరుగుతుందని అన్నారు. కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దివ్యాంగ బాల బాలికలు ఏడు సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయసు గల పిల్లలను వికాసం పాఠశాలలో చేర్పించి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు బాగుపడేలా పిల్లల తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు. ఇతర వివరాలు కొరకు ఫోన్ నెంబర్లు 9381181407, 63 039 47240, 80 74 55 09 53, 96 522 72 266, 9666 07 9593 నెంబర్లను సంప్రదించి తెలుసుకోవాలని ఆయన కోరారు.






