‘శ్రీనివాస మంగాపురం’ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు..

by Mallepaka Hamsa |

దర్శకుడు అజయ్ భూపతి ఈ మూవీలోని మూడో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

‘శ్రీనివాస మంగాపురం’ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు..
X

దిశ, సినిమా: ‘RXX 100’, ‘మంగళవారం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ అనే మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ సినిమాతో ఘట్టమనేని కుటుంబం నుండి సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ ఘట్టమనేని హీరోగా టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. లవ్ అండ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో, ఇంటెన్స్ నరేషన్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. జయకృష్ణ సరసన బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో, తాజాగా దర్శకుడు అజయ్ భూపతి ఈ మూవీలోని మూడో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "ప్రేమ అనే వర్ణించలేని అనుభూతిని పొందే సమయం ఆసన్నమైంది" అంటూ క్యాప్షన్ పెట్టిన ఆయన, ‘గుండె పేలిపోతుందే’ అని సాగే మూడో రొమాంటిక్ పాటను జూన్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక అందమైన దేవాలయంలో రాషా తడాని సాంప్రదాయంగా లంగా ఓణిలో ఎంతో సంతోషంగా పరుగెత్తుతూ కనిపిస్తుండగా, ఆమెను హీరో జయకృష్ణ దొంగచాటుగా చూస్తూ మురిసిపోతున్న విజువల్స్ ఈ పోస్టర్‌లో ఉన్నాయి. ఈ పోస్టర్ చూస్తుంటే ఇదొక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అని అర్థమవుతోంది. ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story