ఆ సమయంలో నా సినీ కెరీర్ ముగిసిపోతుందనుకున్నా.. నరకం చూశానంటూ ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-14 10:33:19  IST  )

ఖాళీగా ఉన్న ఆరు నెలలు తాను చాలా ఆందోళనకు గురయ్యాయని ఎమోషనల్ అయింది. మంచి అవకాశాలు రావడం లేదా? లేక తన సినీ కెరీర్ అక్కడితోనే ముగిసిపోతుందా? అనే ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపింది.

ఆ సమయంలో నా సినీ కెరీర్ ముగిసిపోతుందనుకున్నా.. నరకం చూశానంటూ ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ‘ఓ సుకుమారి’ షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇందులో తిరువీర్ సరసన రొమాన్స్ చేయనుంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మాలి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఒకానొక దశలో తనకు అవకాశాలు లేకపోవడం వల్ల తాను దాదాపు ఆరు నెలల పాటు ఇంట్లోనే ఉన్నట్లు తెలిపింది. అవకాశాలు వచ్చినప్పటికీ తనకు నచ్చిన పాత్రలు, చేయాలని భావించిన కథలు తన వద్దకు రాలేదని అందుకే వచ్చిన వాటిని అంగీకరించలేదని చెప్పింది. నటిగా ప్రతి ఒక్కరి జీవితంలో హై పాయింట్స్, లో పాయింట్స్ ఉంటాయని తన కెరీర్‌లో కూడా అలాంటి పరిస్థితులను తాను చాలాసార్లు ఎదుర్కొన్నట్లు వివరించింది.

ఖాళీగా ఉన్న ఆరు నెలలు తాను చాలా ఆందోళనకు గురయ్యాయని ఎమోషనల్ అయింది. మంచి అవకాశాలు రావడం లేదా? లేక తన సినీ కెరీర్ అక్కడితోనే ముగిసిపోతుందా? అనే ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపింది. నటికి అవకాశాలు లేకపోవడంతో ఆ సమయంలో నరకం చూశానని అన్నారు. ఆ సమయంలోనే తనకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని ఆ సినిమా తన జీవితాన్ని మార్చిందని పేర్కొంది. ఆరు నెలల తర్వాత మొదటిసారి షూటింగ్ సెట్‌లో పాల్గొన్న క్షణాలు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ఓ సుకుమారితో పాటు మహేంద్ర గిరి వారాహి,అండర్-18, ధృవనక్షత్రం వంటి చిత్రాలు కూడా చేస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్స్ త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. వైవిధ్యమైన పాత్రలతో ఐశ్వర్య రాజేష్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

రాజ్ నిడిమోరుపై సమంత ప్రశంసలు.. మిగిలిన డైరెక్టర్స్‌ను తక్కువ చేసిందంటూ ట్రోల్స్

Next Story