రాజ్ నిడిమోరుపై సమంత ప్రశంసలు.. మిగిలిన డైరెక్టర్స్‌ను తక్కువ చేసిందంటూ ట్రోల్స్

by Chukka Sudharani |   (  Updated:2026-06-14 10:32:29  IST  )

సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’.

రాజ్ నిడిమోరుపై సమంత ప్రశంసలు.. మిగిలిన డైరెక్టర్స్‌ను తక్కువ చేసిందంటూ ట్రోల్స్
X

దిశ, సినిమా: సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. తన సొంత బ్యానర్‌పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి నందిని దర్శకత్వం వహిస్తుంది. ఈ సినిమా ఈనెల 19న థియేటర్స్‌లో సందడి చేయనుండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత భర్త రాజ్ నిడిమోరుపై ప్రశంసలు కురిపించింది. ‘నేను ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సమయంలో రాజ్ నిడిమోరు వర్కింగ్ స్టైల్ నన్ను బాగా ఆకట్టుకుంది. అంతకు ముందు చాలా సినిమాలు చేశాను. కానీ రైటర్స్, సినిమాకు పనిచేసే వాళ్ళు అందరూ కూర్చొని ఎవరి పాయింట్ అఫ్ వ్యూ వాళ్ళు చెప్పడం, డిస్కస్ చేసుకోవడం నేను ఎక్కడా చూడలేదు. రాజ్ దగ్గరే మొదటిసారి చూశాను. చాలా సినిమాల్లో డైరెక్టర్ ఏది చెప్తే అదే. ఎవరి మాట వినరు. అది వన్ మ్యాన్ షో అనిపిస్తుంది. కానీ రాజ్ మాత్రం తన టీమ్‌లో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ ఇస్తారు. చాలా మంది తెలివైన వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తే మంచి అవుట్ పుట్ వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్సే సమంతను వివాదంలోకి నెట్టాయి. రాజ్ నిడిమోరు మాత్రమే కాదు.. చాలా మంది డైరెక్టర్స్ అదే స్టైల్ ఫాలో అవుతారు. రైటింగ్ టీమ్‌తో కూర్చుని, హీరో, కొంతమంది నటీనటులతో స్ర్కిప్ట్ విషయంలో డిస్కస్ చేస్తారు. అలాగే హీరోలు మార్పులు చేయమన్నా కొంత మంది డైరెక్టర్స్ చేస్తారు అంటూ నెగిటివ్ కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు.

ఆ సమయంలో నా సినీ కెరీర్ ముగిసిపోతుందనుకున్నా.. నరకం చూశానంటూ ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ కామెంట్స్

Next Story