జాతీయ సమగ్రతపై జ‌న‌సేన ఫోక‌స్.. రేపు ఢిల్లీలో కీల‌క స‌మావేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-14 08:33:40  IST  )

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ జాతీయ స‌మ‌గ్ర‌త‌పై ఫోక‌స్ పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల్లోఆ పార్టీ పోటీ చేసింది. అయితే తెలంగాణ‌లో మాత్రం ఖాతా తెర‌వ‌లేక‌పోయింది. ...

జాతీయ సమగ్రతపై జ‌న‌సేన ఫోక‌స్.. రేపు ఢిల్లీలో కీల‌క స‌మావేశం
X

దిశ‌, వెబ్ డెస్క్ః జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్(janasena Chief and deputy Pawan Kalyan) జాతీయ స‌మ‌గ్ర‌త‌పై ఫోక‌స్ పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. అయితే తెలంగాణ‌లో మాత్రం ఖాతా తెర‌వ‌లేక‌పోయింది. ఏపీలో మాత్రం 21 స్థానాల్లో పోటీ చేసి క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాదు కొంత‌కాలంగా ఆ పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌నాతన ధ‌ర్మం పేరుతో జాతీయ భావాన్ని వినిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ త‌ర‌పున ఆయ‌న‌ సౌత్ లో ప్రచారం చేశారు. అప్పుడు సైతం బ‌లంగా జాతీయ వాదాన్ని వినిపించారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన ప్రాంతీయ వాదంలోనూ ఆయ‌న సమ‌గ్ర జాతీయ వాదాన్ని వినిపించారు. ఇప్ప‌టి కూడా హైద‌రాబాద్ లాంటి న‌గ‌రాన్ని అందరిది అంటూ గ‌ట్టిగా వాదిస్తున్నారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో జాతీయ గ‌ళం

ఈ నేప‌థ్యంలో త‌న జాతీయ గ‌ళాన్ని దేశ రాజ‌ధాని ఢిల్లీలో వినిపించేందుకు ప్రయ‌త్నం చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే అక్క‌డ కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. సోమ‌వారం ఢిల్లీలో జ‌న‌సేన పార్టీ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశానికి జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య‌మైన నేతలు కూడా పాల్గొన‌నున్నారు. స‌మావేశంలో జ‌న‌సేన ప్ర‌స్థానంతో పాటు జాతీయ స‌మ‌గ్ర‌త‌పై చర్చించ‌నున్నారు. అంతేకాదు జాతీయ స‌మ‌గ్ర‌త‌పై త‌న పార్టీకి ఉన్న‌ స్పష్ట‌మైన విధానాన్ని రూపొందించ‌నున్నారు. అలాగే పార్టీ నేత‌లకు సైతం ప‌వ‌న్ క‌ల్యాణ్ దిశానిర్దేశం చేయ‌నున్నారు. దీంతో ఈ స‌మావేశానికి పార్టీ నేత‌లు ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు చేశారు. పవ‌న్ ఢిల్లీకి చేరుకున్న స‌మ‌యంలో ఘ‌నంగా స్వాగ‌తం ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పార్టీ ఎంపీలు ఎయిర్ పోర్టు వ‌ద్ద ఆహ్వానం ప‌లికి త‌మ‌తో పాటే స‌మావేశం వ‌ద్ద‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఢిల్లీలో జ‌న‌సేన నేత‌ల హ‌డావుడి క‌నిపిస్తోంది. ప‌లు చోట్ల జ‌న‌సేన జెండాలు రెప‌రెప‌లాడుతున్నాయి.

Next Story