ఆదివారం తీవ్ర విషాదం: కృష్ణా నదిలో నలుగురు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-14 10:52:29  IST  )

కృష్ణా నదిలో విహారయాత్రకు వెళ్లిన తొమ్బిది మందిలో నలుగురు మృతి చెందారు. నది నడి బొడ్డున బోటులో నుంచి ప్రమాదవశాత్తు 10 మంది నీళ్లలో పడ్డారు. వెంటనే బోటు సిబ్బంది రక్షించేలోపే నదిలో ఈ నలుగురు గల్లంతయ్యారు. ..

ఆదివారం తీవ్ర విషాదం: కృష్ణా నదిలో నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా నది(Krishna River)లో విహారయాత్ర(Excursion)కు వెళ్లిన తొమ్బిది మందిలో నలుగురు మృతి చెందారు. నది నడి బొడ్డున బోటులో నుంచి ప్రమాదవశాత్తు జారి ఈ నలుగురితో పాటు మరో ఆరుగురు నీళ్లలో పడ్డారు. వెంటనే బోటు సిబ్బంది రక్షించేలోపే నదిలో 10 మంది గల్లంతయ్యారు. కొద్దిసేపటికే నీళ్లలో మునిగిపోయారు. అయితే వీరిలో ఐదుగురు క్షేమంగా బయటపడ్డారు. నలుగురు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో కృష్ణానదిలో బోటింగ్‌కు వెళ్లారు. అయితే నదిలో అనూహ్యంగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కుంకలగుంటకు చెందిన వారిగా గుర్తించారు. పెళ్లి ఫంక్షన్ కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story