- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
82 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ సరికొత్త రికార్డ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఒక్క రోజులో ఏకంగా 12 షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ పూర్తి చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ 82ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ యాక్టర్స్ కూడా 8గంటలు పనిచేయడానికి కూడా బాగా అలసిపోతున్నారు.. కానీ అమితాబ్ మాత్రం ఎంతో ఉత్సాహంగా పని చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక్క రోజులో ఏకంగా 12 షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ పూర్తి చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పని అంటే పనే.. అందులో ఎలాంటి రాజీ పడకూడదు, ఈ రోజు పన్నెండు షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్‌తో పాటు రెండు ప్రత్యేక స్టిల్ షూట్లు కూడా పూర్తయ్యాయంటూ బిగ్ బీ షాకిచ్చారు. అమితాబ్ రాసుకొచ్చిన ఆ పవర్ ప్యాక్డ్ మాటలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.
"పరిస్థితులు ఎలా ఉన్నా సరే సమాజంతో, నా అభిమానులతో కనెక్ట్ అయ్యే ఈ అపురూపమైన ప్రక్రియ ఏమాత్రం ఆలస్యం కాకుండా నిరంతరం కొనసాగుతూనే ఉండాలి.. మిగతావన్నీ జీవితంలో సాగుతూనే ఉంటాయి కానీ ఈ అపురూపమైన అనుబంధం మాత్రం ఎప్పటికీ ఆగకూడదు" అంటూ అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మారుతున్న కాలంతో పాటు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ.. అత్యంత కఠినమైన క్రమశిక్షణతో ముందుకు సాగడమే తన విజయ రహస్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కాగా.. అమితాబ్ ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో నటిస్తున్నారు. 82 ఏళ్ల వయసులో ఒకవైపు రియాలిటీ షోలు.. మరోవైపు సినిమాలు చేస్తూనే బిజీ షెడ్యూల్‌లో కూడా అమితాబ్ బచ్చన్ ఒకేరోజులో 12 షార్ట్స్ ఫిల్మ్స్ కంప్లీట్ చేయడం అనేది ఈ తరం నటీనటలుకు ఎంతో ఇన్స్‌పిరేషన్ కలిగించే అంశం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






