- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంభీరావుపేటలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల విస్తృత తనిఖీలు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో డాగ్ స్క్వాడ్ తో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున పోలీసులు విస్తృతంగా తనిఖీ నిర్వహించారు.

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో డాగ్ స్క్వాడ్ తో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున పోలీసులు విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ తో మండల కేంద్రంలో అన్ని షాపులు, మార్కెట్ ఏరియా, పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు, హోటల్ లు, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, మండల కేంద్రంలోని పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ ను తెప్పించామని, మాదకద్రవ్యాలను అరికట్టడానికి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు వాడినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ డాగ్స్ కు మత్తుపదార్థాల వాసన పసిగట్టి వాటిని సులభంగా గుర్తించే గుణం ఉంటుందని, ఈ కారణంగానే జాగిలాలను తనిఖీల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల సరఫరా చేసే వారితో పాటు, వినియోగించి వారిపై కూడా కేసులు నమోదు చేయునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






