- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతనిలో ఉన్న ఆ గుణాలే నన్ను ఆకట్టుకున్నాయి.. ప్రేమపై హింట్ ఇస్తూ హుమా ఖురేషి ఎమోషనల్ పోస్ట్!
హుమా ఖురేషి, తన రూమర్ బాయ్‌ఫ్రెండ్ రచిత్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. తాను రచిత్‌ను మొదటిసారి కలిసినప్పుడు అతని ప్రతిభతో పాటు అతనిలో ఉన్న ఓపిక, పట్టుదల తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.

దిశ, సినిమా: నాచికేత్ సామంత్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'బేబీ డూ డై డూ' . ఇందులో హుమా ఖురేషి 'బేబీ కర్మార్కర్' అనే మూగ కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలోనూ, రచిత్ 'సిద్ధు' పాత్రలోనూ నటించారు. ఈ చిత్రంలో సీమా పహ్వా, సికిందర్ ఖేర్, చంకీ పాండే, హిమాన్షు మాలిక్, అరుణ్ కుష్వాహ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయం నుంచే హుమా ఖురేషి, రచిత్ ప్రేమించుకుంటున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాకుండా గత ఏడాది సెప్టెంబర్‌లోనే ప్రపోజ్ కూడా చేశాడని.. హుమా కూడా ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో.. ఈ వార్తలకు బలం చేకూరేలా హుమా ఖురేషి పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హుమా ఖురేషి, తన రూమర్ బాయ్‌ఫ్రెండ్ రచిత్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. తాను రచిత్‌ను మొదటిసారి కలిసినప్పుడు అతని ప్రతిభతో పాటు అతనిలో ఉన్న ఓపిక, పట్టుదల తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.
బనారస్ లాంటి చిన్న ఊరి నుండి ముంబైకి ఎంతోమంది లాగే రచిత్ కూడా ఒక పెద్ద కలలతో వచ్చాడని.. అయితే మిగతా వారిలా కాకుండా, రాత్రికి రాత్రే సక్సెస్ రాకపోయినా రచిత్ అధైర్యపడి ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోలేదని ఆమె ప్రశంసించారు. ఇక్కడే ఉండి కష్టపడ్డాడని, కొత్త విషయాలు నేర్చుకుంటూ తనను తాను మార్చుకున్నాడని అన్నారు. తన టైమ్ వస్తుందనే నమ్మకాన్ని రచిత్ ఎప్పుడూ కోల్పోలేదని.. ఎలాంటి అడ్డదారులు తొక్కకుండా కేవలం కష్టాన్ని, నిలకడను నమ్ముకున్నాడని హుమా కొనియాడారు. దీనికి రచిత్ స్పందిస్తూ.. నన్ను అందరికీ ఇంత పవర్‌ఫుల్‌గా పరిచయం చేసినందుకు హుమీకి చాలా థాంక్స్ అని రచిత్ ఆనందం వ్యక్తం చేశారు. తన మీద తనకే నమ్మకం లేని రోజుల్లో కూడా తనను నమ్మి, ఎల్లప్పుడూ నిజమైన మద్దతుదారుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ సెట్‌లోనైనా, బయటైనా హుమా దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని.. ఇద్దరం కలిసి సాగిస్తున్న ఈ ప్రయాణం తన జీవితాన్ని ఎంతో అందంగా మార్చేసిందని రచిత్ సింగ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్టులతో వారి ప్రేమపై హింట్ ఇచ్చారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.






