దుమ్మురేపుతున్న ‘పెద్ది’.. 10 రోజుల్లో 400 కోట్ల దిశగా పరుగులు

by Pulgam srinivas |

‘పెద్ది’ 10 రోజుల్లో 378 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 400 కోట్ల వైపు పరుగులు పెడుతోంది.

దుమ్మురేపుతున్న ‘పెద్ది’.. 10 రోజుల్లో 400 కోట్ల దిశగా పరుగులు
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి జోష్‌లో దూసుకుపోతుంది. జూన్ 4న విడుదలైన ఈ సినిమాకు మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, తొలి నాలుగు రోజులు భారీ కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో వసూళ్లు కొంత తగ్గాయి. కానీ మళ్లీ వీకెండ్ రావడంతో కలెక్షన్ల జోరు పెరిగింది. నిన్న శనివారం కావడంతో సినిమాకు మంచి వసూళ్లు నమోదైనట్లు తెలుస్తోంది. నిన్నటితో కలిపి ఈ సినిమా 10 రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకుంది. దాంతో మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించిన పోస్టర్ ప్రకారం 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 378 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

ఇక ఇవాళ ఆదివారం కావడంతో మరింత భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈరోజు లేదా రేపటిలోనే ఈ సినిమా 400 కోట్ల మార్క్‌ను చేరే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక మొత్తం రన్ పూర్తయ్యేసరికి సినిమా ఎన్ని వసూళ్లు సాధిస్తుందో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.




Next Story