ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు.. గేట్లు ఎత్తిన అధికారులు

by Naga Rani Yarlagadda |

విజయవాడ, మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు.. గేట్లు ఎత్తిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ, మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి సముద్రంలోకి 2900 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. బందరు, రైవస్ కాలువ నుంచి 2100 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. మరో మూడు, నాలుగురోజుల పాటు కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాలువలకు సమీపంలో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.

కాగా.. నేడు శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

Next Story